వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరుగుపై బిజెపికి హరికృష్ణ, అది జగన్ సంస్కారం: రఘు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nandamuri Harikrishna
హైదరాబాద్/గుంటూరు: దేశమంతా ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సమైక్యం వైపు పరుగులు పెడుతుంటే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ విభజన వైపు పరుగు పెడుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆదివారం విమర్శించారు. బిజెపి తెలంగాణకు మద్దతు పలుకుతున్న అంశంపై ఆయన పై విధంగా స్పందించారు. బిజెపి అగ్రనాయకత్వం సీమాంధ్రలోని ఆందోళనలను గుర్తించాలని కోరారు.

జగన్‌పై రఘువీరా

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని మంత్రి రఘువీరా రెడ్డి గుంటూరులో అన్నారు. డిగ్గీ వయసుతో పోలిస్తే జగన్ వయసు ఎంత అని మండిపడ్డారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ కాంగ్రెసువాది అనే భావనతోనే డిగ్గీ అలా మాట్లాడారని, దానిని కూడా తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే తాము వదిలేస్తున్నామని రఘువీరా అన్నారు.

కాగా, కాంగ్రెసి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. జగన్ డిఎన్ఎ తమ పార్టీదేనని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యపై ఆయన ప్రతిస్పందించారు. దిగ్విజయ్ సింగ్‌ను లాగి చెంపపై కొట్టండని ఆయన అన్నారు.

English summary
Telugudesam Party leader and Former MP Nandamuri Harikrishna appealed BJP that consider the Seemandhra agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X