జోకర్ ఎప్పటికీ అంతే: కిరణ్‌పై హరీష్, వారు త్రీఇడియట్స్
మెదక్/గుంటూరు: జోకర్ ఎప్పటికీ హీరో కాదని, ముఖ్యమంత్రి జోకర్ పంచ్ డైలాగులు కొట్టిన రీతిలో మాట్లాడుతూ హీరోగా భావిస్తే కుదరదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు ఆదివారం ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ, సీమాంధ్ర జిల్లాల ప్రజల్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన నడిపించేదంతా నాటకమేనన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాకు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తూ నిధుల వరద పారిస్తున్నాడని చెప్పారు. సైనిక్ స్కూల్ , వైద్య కళాశాల , తాగునీటి కోసం రూ.5800 కోట్లు చిత్తూరు జిల్లాకే కేటాయించుకోవడం దీనికి నిదర్శనమన్నారు. ఫైలిన్ తుపాన్‌ను అడ్డుకోలేకపోయాను కాని తెలంగాణను అడ్డుకుంటానని అనడం హాస్యాస్పదమన్నారు.

టి కాంగ్ జైత్రయాత్రలపై శ్రవణ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన అనంతరం ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జనం లేని జైత్రయాత్రలు చేస్తున్నారని తెరాస నేత శ్రావణ్ ఎద్దేవా చేశారు. ఉద్యమాల ఫలితంగా కేంద్రం విభజన ప్రకటన చేస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లబ్ధి పొందేందుకు జైత్రయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆ జైత్రయాత్రలు జనం లేక వెలవెలబోతున్నాయని, కాంగ్రెస్ నాయకులు గన్‌మెన్లు, డ్రైవర్లు మాత్రమే జైత్రయాత్రలో పాల్గొంటున్నారన్నారు.
హైదరాబాద్‌పై అజమాయిషీ కోసమే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిలు త్రీఇడియట్స్‌లుగా దాష్టీకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న ఆ ముగ్గురిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. వారికి తోడు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హైదరాబాద్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications