జగన్ ఐదేళ్ల పాస్ పోర్టుకు హైకోర్టు షరతు-ఏపీ సర్కార్ కు కీలక ఆదేశం..!
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత లండన్ పర్యటనకు కీలకంగా మారిన పాస్ పోర్టు వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. సీబీఐ కోర్టు గతంలో ఐదేళ్ల పాస్ పోర్టు తీసుకోవచ్చని సూచించినా విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు ఏడాదికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో పాస్ పోర్టు అధికారులు విజయవాడ కోర్టు నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని సూచించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్ వినతిని అంగీకరిస్తూనే కీలక షరతు విధించింది.
విజయవాడ ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ జగన్ పై దాఖలు చేసిన పరువు నష్టం దావా ఆరేళ్లుగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఏడాదికి మాత్రమే పాస్ పోర్టు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దానికీ కోర్టుకు వచ్చి పూచీకత్తు సమర్పించి ఎన్వోసీ తీసుకోవాలని సూచించింది. దీనిపై విజయవాడ కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ కు అక్కడ మిశ్రమ ఫలితం ఎదురైంది.

ఓవైపు వైఎస్ జగన్ కోరుకున్నట్లుగా ఐదేళ్ల సాధారణ పాస్ పోర్టు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. మరోవైపు విజయవాడ కోర్టుకు మాత్రం వెళ్లాల్సిందే అని షరతు పెట్టింది. భద్రతా పరమైన కారణాలు చూపుతూ విజయవాడ కోర్టుకు వెళ్లననడం సరికాదని జగన్ కు తేల్చిచెప్పేసింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం జగన్ హాజరయ్యే సమయంలో తగిన భద్రత కల్పింంచాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేపో మాపో జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కాబోతున్నారు.












Click it and Unblock the Notifications