తప్పిన ప్రమాదం: పొల్లాలో ఓ హెలికాప్టర్, రోడ్డుపై మరో హెలికాప్టర్ దిగాయి

విజయనగరం: నావికా దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఎంఆర్ పురం సమీపంలోని పంటపొలాల్లో దిగింది. సాంకేతిక లోపం తలెత్తడంతో అది పంటపొలాల్లో దిగింది. లోపం గుర్తించి దానిని దించడంతో ప్రమాదం తప్పింది.

పంటపొలాల్లో దిగిన హెలికాప్టర్‌ను బాగు చేసేందుకు మరో హెలికాప్టర్‌లో నేవీ అధికారులు వచ్చారు. రెండు హెలికాప్టర్లు రావడంతో పెద్ద ఎత్తున జనం ఆ హెలికాప్టర్లను చూసేందుకు వచ్చారు. కాగా, హెలికాప్టర్లోని ముగ్గురు సిబ్బంది క్షేమంగా ఉన్నారు.

Helicopter lands on fields in Vijayanagaram

సిగ్నల్ లేక మరో హెలికాప్టర్

పంటపొలాల్లో దిగిన హెలికాప్టర్ తర్వాత గంటల్లోనే మరో హెలికాప్టర్ రహదారిపై దిగింది. ఒడిశా - విశాఖ హెలికాప్టర్ ఒకటి సిగ్నల్ లేక జిమ్మయ్యవలస మండలంలో దిగింది. తురకనాయుడువలస - నాగూర్ మధ్య రహదారి పైన హెలికాప్టర్ దిగింది. దానిని నాగూర్ ఉన్నత పాఠశాలకు తరలించారు.

బస్సు, లారీ ఢీ: 10 మందికి గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని అయిజ మండలం పద్దిపురం వద్ద సోమవారం ఉదయం రాయచూర్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో పది మంది ప్రయాణీకులు గాయపడ్డారు. విషమంగా ఉన్న ఇద్దరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెట్టును ఢీకొన్న జీపు: ఒకరు మృతి

అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి వద్ద వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+