తండ్రి ఆశీస్సులతో కదనరంగంలోకి జగన్: కడప టూర్ షెడ్యూల్ ఇదే: తుది జాబితా విడుదల
AP Assembly election 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను విడుదల చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీని తరువాత ఇక గ్రామస్థాయిలో ప్రచార హోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో- ఉత్కంఠభరిత పోరు ఉండబోతోంది.
రేపు కడపకు జగన్..
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోయే రోజే- అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే రోజున కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించనున్నారు. అక్కడే తుది జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది.

షెడ్యూల్ విడుదల..
వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10:45 నిమిషాలకు జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. 11:05 నిమిషాలకు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. 11:15కు గన్నవరం నుంచి కడపకు ప్రత్యేక విమానం టేకాఫ్ అవుతుంది.
జిల్లా పార్టీ నేతలతో భేటీ..
మధ్యాహ్నం 12:05 నిమిషాలకు కడపకు చేరుకుంటారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జగన్‌కు స్వాగతం పలుకుతారు. 12:15 నిమిషాలకు హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు బయలుదేరుతారు. 12:30కు అక్కడికి చేరుకుంటారు.
ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో..
మధ్యాహ్నం 12:40 నిమిషాలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు జగన్. 12:55 నిమిషాలకు అక్కడే ప్రార్థనల్లో పాల్గొంటారు. 12:58 నుంచి 1:20 నిమిషాలకు పార్టీ నాయకులను కలుసుకుంటారు. అప్పుడే- అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3:30లకు జగన్.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications