బాలకృష్ణపై కల్యాణ్ రామ్ సెటైర్లు..? పంచ్ డైలాగ్‌తో కౌంటర్
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయట పడ్డాయి. నందమూరి కుటుంబంతో హరికృష్ణ ఫ్యామిలీ కొంత గ్యాప్ మెయిన్‌టైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణకు హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ల మధ్య మాటల్లేవని తెలుస్తుంది. తాజాగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి తెర మీదకు వచ్చినట్టు కనిపిస్తుంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సమయంలో కల్యాణ్ రామ్ కాస్తా భావోద్వేగంతో మాట్లాడారు.
సినిమా అద్భుతంగా వచ్చిందని.. మీరందరూ సినిమా చూసి ఆదరించాలని ఆయన కోరారు. అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఆప్‌డేట్ ఇవ్వామని కోరడంతో.. తమ్ముడు దేవర షూటింగ్‌లోనే ఉన్నాడని మీరు అడిగారని కంగారు పడి ఏదో ఒకటి ఇస్తే మళ్లీ మీరే దానిపై విమర్శలు చేస్తారని.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారని ..దాని వల్లే దేవర లేట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

అయితే కల్యాణ్ రామ్ స్పీచ్ చివర్లో జై ఎన్టీఆర్ , జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించేశారు. ఆయన ఎక్కడ కూడా బాబాయ్ బాలకృష్ణ గురించి ప్రస్తావించలేదు. దీనికి తోడు డెవిల్ ట్రైలర్ చివర్లో వచ్చే ఓ డైలాగ్ బాలకృష్ణను ఉద్దేశించి చెప్పారనే టాక్ వినిపిస్తుంది. ''విశ్వాసంతో ఉండటానికి , విధేయతతో ఉండాటానికి నేను ఏమైనా కుక్కని అనుకుంటున్నావా.. లైయన్'' కల్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ డైలాగ్ తన బాబాయ్‌ను ఉద్దేశించి..చెప్పినట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

బాలకృష్ణ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూనే వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాడన్ని బాలకృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే.. తన కొడుకు నారా లోకేష్ రాజకీయ భవితవ్యం అంధకారం అవుతుందని భావించే ..ఎన్టీఆర్ రాకను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని మాటలు టీడీపీలోని వినిపిస్తున్నాయి.

తారకరత్న మరణం తరువాత జరిగిన కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను చూసి చూడనట్టుగానే బాలకృష్ణ వెళ్లిపోయారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడిన సమయంలో కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక వీడియో ద్వారానే స్పందించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఈ ఇద్దరి అన్నదమ్ములు నుంచి కనీసం స్పందన కరువైంది. దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌పై ఘాటుగానే విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. బాలకృష్ణ స్పందిస్తూ ..''బ్రో ఐ డోంట్ కేర్'' అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు దానికి కౌంటర్‌గానే ''విశ్వాసంతో ఉండటానికి , విధేయతతో ఉండాటానికి నేను ఏమైనా కుక్కని అనుకుంటున్నావా.. లైయన్'' అనే డైలాగ్‌తో బాబాయ్‌కు జవాబు ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications