85 రోజుల తరువాత వైసీపీ ముఖ్య నేతకు బెయిల్ - కండీషన్స్ అప్లై..!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలు కేసులు నమోదు చేసింది. లిక్కర్ తో పాటుగా వైసీపీకి చెందిన పలువురు ఇతర కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రులు జైలుకు వెళ్లారు. కాగా, 75 రోజుల తరువాత మాజీ మంత్రికి ఈ రోజు హైకోర్టులో బెయిల్ లభించింది. షరతులతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. మైనింగ్ కేసులో కాకాణికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 85 రోజులు నెల్లూరు జైలులో కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మైనింగ్ తో పాటుగా మొత్తం ఎనిమిది కేసులు కాకాణి మీద నమోదయ్యాయి. తహసీల్దారు డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసి, ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేసి స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, మిగిలిన కేసుల్లో ఇప్పటికే కాకాణికి బెయిల్ దక్కింది. ఇప్పుడు హైకోర్టులో మైనింగ్ కేసులో బెయిల్ రావటంతో జైలు నుంచి బయటకు రావటానికి కాకాణికి అవకాశం కలిగింది. ఇదే సమయం లో హైకోర్టు బెయిల్ మంజూరు వేళ పలు షరతులు విధించింది.

కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పలు షరతులు విధించింది. కాకాణి పాస్ పోర్టును హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశించింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొద్ది రోజుల క్రితం నెల్లూరు కోర్టు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. కృష్ణపట్నం సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకి పాల్పడ్డారనేది కాకాణి పైన మరో కేసు ఉంది. అయితే, వీటిల్లో విచారణ కోసం కోర్టు కొద్ది రోజుల క్రితం కస్టడీకి అనమతి ఇచ్చింది. పోలీసులు విచారణ చేసారు. తాజాగా మాజీ సీఎం జగన్ నెల్లూరు జైలులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. ఇక, ఇప్పుడు 85 రోజుల తరువాత కాకాణి కి అన్ని కేసుల్లో బెయిల్ దక్కటంతో.. రేపు (మంగళవారం) జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కలిగింది.












Click it and Unblock the Notifications