తిరుమలను అలా మార్చకండి - హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

Tirumala: తిరుమల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో జరుగుతున్న నిర్మాణాల పైన స్పందించిన హైకోర్టు పలు సూచనలు చేసింది. తిరుమలను కాంక్రీట్‌ జంగిల్‌గా మారనీయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తాము కఠినంగానే ఉంటామని హెచ్చరించింది. నిర్మాణాల విషయంలో టీటీడీతో సహా పీఠాలు .. దేవాదాయ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తిరుమలలో అక్రమ నిర్మాణాల పైన హైకోర్టు సీరియస్ అయింది. భవన నిర్మాణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ధార్మిక సంస్థల పేరుతో ఎలాపడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలను అనుమతిస్తూ పోతే కొన్నాళ్లకు అటవీప్రాంతం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తాము కఠినంగానే ఉంటామని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని వ్యాజ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.

high-court-key-directions-for-ttd-over-latest-constructions-in-tirumala

తిరుమలలో అనుమతులు లేకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నా, టీటీడీ పట్టించుకోవ డం లేదంటూ తిరుపతికి చెందిన మహేశ్‌ వేసిన పిల్‌పై హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు, టీటీడీ తరఫున న్యాయవాది సుమంత్‌ వాదనలు వినిపించారు. తిరుమల ను కాంక్రీట్‌ జంగిల్‌గా మారనీయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తాము కఠినంగానే ఉంటామని హెచ్చరించింది. దీంతో, హైకోర్టు స్పష్టత ఇవ్వటంతో ఇక నుంచి తిరుమలలో జరిగే నిర్మాణాల విషయంలో టీటీడీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+