జగన్‌కు బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణను కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను త్వరగా పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామజోగయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, సీబీఐ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్ఛార్జి పిటిషన్‌లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ తీరు గతం కంటే మెరుగుపడ్డప్పటికీ సంతృప్తికరంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టంచేస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేయడం జరిగింది.












Click it and Unblock the Notifications