లిక్కర్ కేసులో మిథున్ కు భారీ షాక్ - ఇక నెక్స్ట్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనలో అవినీతి - అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలు కేసులు నమోదు చేసింది. వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణ లు చేసారు. సీఐడీకి విచారణకు అప్పగించారు. పార్లమెంట్ లోనూ ఈ అంశం పైన ఎంపీ లావు శ్రీ క్రిష్ణదేవరాయులు ప్రస్తావన చేసారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఈ కేసు లో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బెయిల్ పిటీషన్ డిస్మిస్
లిక్కర్ కేసులో వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీ షన్ దాఖలు చేసారు. పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు జరిగాయింటూ గతేదాడి సెప్టెంబరు 23న సీఐడీ పోలీ సులు కేసు నమోదు చేశారు. దీంతో కేసులో తన పేరు చేర్చి ఎక్కడ అరెస్టు చేస్తారేనే అనుమానం తో హైకోర్టును ఎంపీ మిథున్ రెడ్డి ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ సైతం వేశారు.

high-court-rejects-mp-mithun-reddy-anticipatory-bail-petition-in-liquor-case

సీఐడీ విచారణలో
ఈ పిటీషన్ల పైన దీనిపై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాళ్టి(ఏప్రిల్ 3)కి వాయిదా వేసింది. ఈ మేరకు మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల విషయంలో పలు ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ నగదు చెల్లింపులు చేయకుండా నేరుగా డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని, మద్యం సరఫరాలోనూ అనేక అవకత వకలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంట నే ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది.

Take a Poll

కోర్టు నిర్ణయం
వాసుదేవ రెడ్డి విచారణ సమయంలో కంపెనీలకు మద్యం ఆర్దర్ల విషయంలో మిథున్ రెడ్డి పాత్ర గురించి ప్రస్తావించినట్లు ప్రచారం సాగింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హై కోర్టు ను ఆశ్రయించారు. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, మిథున్ రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ తండ్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి చేతికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను చూసేందుకు వచ్చినప్పుడు పిటిషనర్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసులో పిటిషనర్‌ను నిందితుడిగానే చేర్చలేదని, ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, విచారణకు హాజరుకావాలని ఆదేశించలేదని సిద్ధార్థ లూథ్రా వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎంపీ పేరు లేదని, అపరిపక్వ దశలో ఉన్న కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారని పేర్కొన్నారు. మీడియా కథనాలు ఆధారంగా బెయిల్ కోరారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి వాయిదా వేసిన తీర్పు నేడు వెలువరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+