సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.సీఎం జగన్ పై రాయి వేసిన నిందితుడు సతీష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు. రాయి వేసింది సతీష్ అని నిర్థారించి అతడిని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేయించింది బొండ ఉమనే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ దాడి జరగడం, అది కూడా టీడీపీ ఆఫీస్ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో బొండ ఉమపైనే వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు సతీష్ తండ్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్త అనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా బొండ ఉమ ఇంటికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీఎం జగన్ రాళ్లదాడి కేసులో బొండ ఉమను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే ఉమను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అర్థరాత్రి తరువాత బొండ ఉమను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 13న సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం'యాత్రలో భాగంగా విజయవాడలో ప్రవేశించిన రోజే ఆయనపై రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది.ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications