మండుతున్న ఎండలు, బంగాళాఖాతంలో ఆవర్తనం - వర్షాల పై బిగ్ అప్డేట్..!!
వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. జూలై లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవు తున్నాయి. నెల్లూరులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా వడగాడ్పులు వీస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ..రేపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఫలితంగా ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు కొనసాగుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4నుంచి 8డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా నెల్లూరు లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరంలో 39.6, నరసాపురంలో 39.4, జంగమహేశ్వరపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూలైలో 40 డిగ్రీలు నమోదుకావడం తో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రుతుపవన ద్రోణి ఎక్కువ రోజులు మధ్య, తూర్పు, వాయువ్య భారతంలో ఉండిపోయింది. జూలై నెలాఖరు వరకూ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో డ్యామ్‌లకు వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్టుగానే కిందకు వదలాలి.

శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో నాగార్జునసాగర్‌కు వరద వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద పంటలకు ఫర్వాలేదు గానీ వర్షాధార ప్రాంతాల్లో మాత్రం ఇబ్బంది కనిపిస్తోంది. ఇదే సమయంలో వర్షాల పైన వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది.
ఉపరితల ఆవర్తనం ఈ నెల 18కల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నదని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. దీంతో 18వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అంచనా వేశారు. ఈ నెల 22 నాటికి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళా తంలోకి వచ్చిన తరువాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 వరకూ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications