కాలు బయటపెట్టాలంటేనే భయపడేలా: ఎండదెబ్బ43డిగ్రీలు..
ఆంధ్రప్రదేశ్ లోని కడప, కర్నూలు జిల్లాల్లో ఈరోజు అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా ఒంగోలు, మచిలీపట్నంలో 35డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్: ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. నిప్పులు కురిపిస్తున్న భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్దులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
మధ్యభారతంలో ఉష్ణగాలుల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం నాడు 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మరాట్వాడల్లోను వచ్చే రెండు రోజుల్లో ఇదే తీవ్రస్థాయి ఉష్ణగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప, కర్నూలు జిల్లాల్లో ఈరోజు అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా ఒంగోలు, మచిలీపట్నంలో 35డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో ఉష్ణోగ్రతల వివరాలు:
అనంతపురం- 42 డిగ్రీలు
నంద్యాల, తిరుపతి- 41 డిగ్రీలు
జంగమహేశ్వరరం- 40 డిగ్రీలు
నందిగామ- 39 డిగ్రీలు
విశాఖపట్నం, తుని, కావలి, కాకినాడ -36 డిగ్రీలు
మచిలీపట్నం, ఒంగోలు- 35 డిగ్రీలు
నర్సాపురం, కళింగపట్నం- 34 డిగ్రీలు
తెలంగాణలో ఉష్ణోగ్రతల వివరాలు:
ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, మెదక్- 42 డిగ్రీలు
భద్రాచలం, మహబూబ్‌నగర్- 41 డిగ్రీలు
హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ- 40 డిగ్రీలు
హకీంపేటలో 39 డిగ్రీలు












Click it and Unblock the Notifications