చంద్రబాబు - కేవీపీ మంతనాలు : 2024 ఎన్నికలే లక్ష్యంగా - మారుతున్న సమీకరణాలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 ఎన్నికలు అధికారంలో ఉన్న వైసీపీ..ప్రధాన ప్రతిపక్ష టీడీపీ భవిష్యత్ కు కీలక కానున్నాయి. ముఖ్యమంత్రి సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠతో ముడిపడి ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే ఇద్దరూ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈ సారి ముందుగానే అభ్యర్ధులను ప్రకటించటానికి టీడీపీ అధినేత సిద్దం అవుతున్నారు. సీఎం జగన్ అటు పార్టీ..ఇటు ప్రభుత్వంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టారు. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టే విధంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు - కేవీపీ మంతనాలు
ఇక, వచ్చే ఎన్నికల్లో తిరిగి 2014 తరహాలో పొత్తుల దిశగా టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కుప్పం లో చంద్రబాబు జనసేనతో పొత్తు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం మైండ్ గేమ్ లో భాగమంటూ వ్యాఖ్యానించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో జనసేన తన మైత్రి బీజేపీతో కంటిన్యూ అవుతుందా లేదా అనే అంశం పైన తేల్చే అవకాశం ఉంది. ఇక, బీజేపీ ఏపీలో టీడీపీతో పొత్తులు ఉండవనే సంకేతాలు ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఏ ఇతర పార్టీ పైన విమర్శలు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక, తాజాగా చంద్రబాబు సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు తో మంతనాలు చేయటం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.

ఏపీ రాజకీయాలపైనే ఇద్దరూ
టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకటరావు మరణంతో నివాళి అర్పించేందుకు ఇద్దరు నేతలు వచ్చారు. అక్కడ చంద్రబాబు - కేవీపీ ఇద్దరూ పక్కకు వెళ్లి మంతనాలు చేయటం ఇప్పుడు చర్చకు కారణమైంది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణించిన సమయంలోనూ నివాళి అర్పించేందుకు వెళ్లిన చంద్రబాబుతో కేవీపీ మంతనాలు చేసారు. వైఎస్సార్ ఆప్త మిత్రుడు అయిన కేవీపీ ..ఆయన రెండు సార్లు సీఎం అవ్వటం వెనుక తన వంతు పాత్ర పోషించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా మారారు. ఇక, వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ లోనే కొనసాతున్నారు. ఏపీలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలో మాత్రమే హాజరయ్యారు. ఆ తరువాత జగన్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో విభేదించిన చంద్రబాబు.. కాంగ్రెస్ నేత రాహుల్ నివాసానికి వెళ్లారు.

జాతీయ స్థాయిలోనూ కీలకంగా
ఆ తరువాత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జాతీయ నేతలతో మంతనాలు చేసారు. కానీ, ఊహించని విధంగా అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావటంతో చంద్రబాబు జాతీయ రాజకీయాల పైన మౌనం పాటిస్తున్నారు. ఇక, వీరిద్దరూ రాష్ట్ర - జాతీయ రాజకీయాల పైన చర్చించుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో జగన్ పాలనా తీరు.. తెలంగాణలో షర్మిల పార్టీ పరిస్థితి పైనా చర్చింటుంరానే చర్చ వినిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో టార్గెట్ 2024
చంద్రబాబు మాత్రం ఈ సారి పూర్తిగా ఏపీ రాజకీయాల పైనే ఫోకస్ పెట్టారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ స్థాయిలో సమీకరణాల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఒకే చోట కలవటంతో ఇద్దరూ ప్రస్తుత పరిణామాల పైన చర్చించుకోవటం మినహా.. ఇందులో ప్రత్యేకత ఏదీ లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఏపీలో రాజకీయం వేగంగా మారుతున్న సమయంలో చంద్రబాబు - కేవీపీ లాంటి సీనియర్ నేతలు కలిసి చర్చించుకోవటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సహజంగానే ఆసక్తికి కారణమవుతోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications