ముంబైలో హైద్రాబాద్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాదు అడిక్‌మెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, రుక్మిణిల కూతురు దివ్య. రాష్ట్రంలో ఎంబిబిఎస్ చేశారు. తర్వాత అనస్తీషియా విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు మూడు నెలల క్రితం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరారు. హాస్టల్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం హాస్టలు గదిలో దివ్యను కలుసుకునేందుకు ఆమె స్నేహితురాలు వచ్చారు.
పడుకునే ఉన్న దివ్య స్పందించక పోవడంతో విద్యార్థులు ఆమెను వెంటనే జస్లోక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దివ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనస్తీషియా మందును మితిమీరిన మోతాదులో తీసుకోవడం వల్లే దివ్య మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.
ఆత్మహత్య అని చెప్పేందుకు ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ లేఖ కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే దివ్య మృతి హత్యగా తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications