సంక్రాంతి తర్వాత: కొత్త పార్టీపై రాయపాటి, కిరణ్‌పై డొక్కా

అవిశ్వాస తీర్మానంపై ముందుకెళ్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతోనే లోకసభ సమావేశాలను అర్ధాంతరంగా కుదించారన్నారు. రాష్ట్ర సమైక్యతను కోరుకునే ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలు గట్టిగా అసెంబ్లీలో వినిపించాలని సూచించారు. సమైక్యాంధ్ర విషయంలో ముందున్నామంటూ చెపుపుకునే వారు ఎపిఎన్జీవోల సమావేశానికి ఎందుకు వెళ్లలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. విభజనపై నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేయడం కాంగ్రెసు నాయకుల తప్పేనన్నారు.
తాము బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంపై మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని మరో ఎంపీ సబ్బం హరి వేరుగా అన్నారు. తాము అవిశ్వాసం ప్రవేశ పెడితే కేంద్రం తెలంగాణపై ముందుకు వెళ్లలేదన్నారు.
బిల్లులో లోపాలు: మాణిక్య వరప్రసాద్
తెలంగాణ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ రూపొందించిన పత్రాన్ని మంత్రి శనివారం గాంధీ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లు సమగ్రంగా లేదని విమర్శించారు. బిల్లులో లోపాలు ఏమిటో తాను అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెబుతానని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించడంలో తప్పేమి లేదన్నారు. కిరణ్ లోగడ స్పీకర్‌గా పని చేసినందున అన్ని విషయాలు తెలుసునని అన్నారు. కొంతమంది సభ్యులు సభాపతి గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications