భయపడను.. విశాఖ వెళ్తా, వచ్చాక జెసిపై చర్యలు: డిగ్గీ

తాను ఎప్పుడూ ఎవరికీ భయపడలేదని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన విమర్శలు చేసినందుకు అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి నోటీసులు పంపించామని చెప్పారు. జెసి నుండి సమాధానం కోసం వేచి చూస్తున్నామని, వివరణ వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా అధిష్టానాన్ని వ్యతిరేకించలేదని, సోనియా పైన ఎప్పుడూ విమర్శలు చేయలేదని చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సోనియా గాంధీని విమర్శించినట్లుగా తన దృష్టికి ఎప్పుడు రాలేదన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారి పేర్లు చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తాము ప్రాంతీయ కమిటీలు వేస్తామని చెప్పారు.
కాగా, తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిందని, అప్పుడే తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు అంగీకరించారని, ఎన్నికలకు ముందే రాష్ట్రం ఏర్పడుతుందని భావిస్తున్నానని డిగ్గీ మంగళవారం చెప్పిన విషయం తెలిసిందే. సీమాంధ్ర నేతలు రాష్ట్రపతికి అఫిడవిట్ ఇచ్చే బదులు అసెంబ్లీలో జరిగే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తే బాగుంటుందని సూచించారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని వివరించారు.
కాంగ్రెసు పార్టీ రాజకీయాలను పరిపాలనతో ముడిపెట్టదన్నారు. తెలంగాణపై గతంలో అన్ని పార్టీలు వాగ్దానం చేశాయని చెప్పారు. ఇప్పుడు కొన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా తాము విభజనకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనానికి, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంలో చివరి బంతి పూర్తి కాలేదని, అప్పటి వరకు పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా కౌంటర్ ఇచ్చారు. చివరి బంతి ఎప్పుడు వస్తుందో ముఖ్యమంత్రికి తెలియక పోవచ్చునన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications