ప్రాణం పోయినా టిడిపిలో చేరను: వైసీపీ ఎమ్మెల్యే అప్పారావు

అమరావతి: ప్రాణం పోయినా తాను టిడిపిలో చేరే ప్రసక్తే లేదని నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి బతికున్న సమయంలో తనకు ఎంతగానో తోడ్పాటును అందించారని మేకా ప్రతాప్ అప్పారావు గుర్తు చేశారు.

వాక్ విత్ జగన్ కార్యక్రమంలో అప్పారావు పాల్గొన్నారు. కొంత కాలంగా ప్రతాప్ అప్పారావు పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అప్పారావు ఖండించారు.

Iam not joining TDP says ysrcp MLA Apparao

నూజివీడులో ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశానని అప్పారావు గుర్తు చేశారు ప్రాణం పోయినా తాను టీడీపీలో చేరనని తెలిపారు. వైసీపీలో తాను కొనసాగడం తన బాధ్యతని మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. తన శరీరాన్ని ముక్కలుగా కోసినా, తాను పార్టీ మారబోనని చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు నిధులు కూడా రావడం లేదని ఆయన మండిపడ్డారు. తాను ప్రజల మనిషినని, ప్రజలతో మమేకమై ఉంటానని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని చెప్పారు. నూజివీడు అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+