రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం: నాగార్జున వర్సిటీ విద్యార్థిదే
గుంటూరు: ఏపీలోని గుంటూరు రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని ఓ మృతదేహాన్ని సోమవారం నాడు గుర్తించారు. దీనిని నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థి గణేష్‌దిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు పట్టేందుకు పోలీసులు గణేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పది రోజుల క్రితం నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన గణేష్ అదృశ్యమయ్యాడు. అతను గదిలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో పోలీసులు ఈ మృతదేహం గణేష్‌ది కావొచ్చని అనుమానిస్తున్నారు.

గణేష్ నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ రోజు రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన మృతదేహం లభించింది. గణేష్ వయస్సు 20. కాగా, మృతదేహం గణేష్‌ది అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. తన తండ్రి తీరు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గణేష్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని సమాచారం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!