అక్రమ సంబంధం: వ్యక్తి మృతిపై అనుమానాలు

వీరిద్దరు మూడేళ్ల క్రితం గ్రామం విడచి వెళ్ళిపోవడంతో సరోజిని భర్త తన భార్య కనిపించడం లేదని చాట్రాయి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ఖమ్మం జిల్లాలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి సరోజినిని తీసుకువచ్చి వారి అన్నయ్యలకు అప్పగించారు. ముసునూరు మండలం చెక్కపల్లిలో ఉంటున్న అన్నయ్య చెన్నారావు వద్దకు సరోజిని వచ్చింది.
మృతుడు పుల్లారావు సరోజిని చెక్కపల్లిలో ఉంటోందని తెలుసుకుని మృతుని అక్క కూడా చెక్కపల్లిలో ఉండటంతో ఆదివారం చెక్కపల్లిలోని అక్క ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం రాత్రి సరోజిని వద్దకు వెళ్తానని అక్కతో చెప్పి బయటకు వచ్చిన మృతుడు పుల్లారావు తెల్లవారుజామున సరోజిని అన్నయ్య వాళ్ళ ఇంటి వద్ద మరణించి కనిపించాడు.
అతని వద్ద పురుగుల మందు డబ్బాతోపాటు మద్యం సీసా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న అక్క బంధువులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి శోభన్‌కుమార్ నూజివీడు డిఎస్‌పి టిఎస్ వెంకటనారాయణకు సమాచారం ఇచ్చారు.
డిఎస్‌పి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడు పుల్లారావుది ఆత్మహత్య కాదని, సరోజిని అన్నయ్యలే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. ఈ విషయమై డిఎస్‌పి మాట్లాడుతూ పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని, ప్రస్తుతం ఆనుమానాస్పద మృతిగా నమోదు చేశామని వివరించారు. బంధువులతో చర్చల అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నూజివీడు ఏరియా అసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.












Click it and Unblock the Notifications