బయటకు రావద్దు, తొలగని ముప్పు - ప్రజలకు బిగ్ అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాలు నీట మునిగాయి. రెండు ప్రాంతాల్లోనూ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పైన వరద నీరు ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పైన వరద నీరు నిలిచింది. ఐఎండీ తాజా హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు.

భారీ వర్షాలతో
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయవాడలో మళ్లీ భారీ వర్షం మొదలైంది.. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతోంది. ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్టీజీఎస్ ద్వారా వర్షాలు, వరద, సహాయక చర్యల పైన ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

IMD predicts heavy rain fall for Coastal districts in next two days Govt Alert

బయటకు రావద్దు
పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదముందని పేర్కొంది. ట్రాన్స్‌ఫారం ఉన్న ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పోల్స్‌ దగ్గరకు వెళ్లొద్దని సూచించింది.

ప్రభుత్వం అప్రమత్తం
వర్షాలు, సహాయక చర్యల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసారు. అధికారులకు కీలక సూచనలు చేసారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న చర్యల పైన ఆదేశాలు ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు పోటెత్తుతోంది. వరద నీరు సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అదే విధంగా అంటు వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+