టీడీపీలోకి ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు - చంద్రబాబు హామీతో..!?
ఏపీలో ముందస్తుగానే ఎన్నికల హీట్ పెరుగుతోంది. ప్రధాన పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబుకు రానున్న ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. అందునా మూడు రాజధానుల అంశం పెండింగ్ లో ఉండటంతో..మూడు రీజియన్లలోనూ పార్టీ బలోపేతం పైన ఇద్దరు నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. చంద్రబాబు ఇవే వర్గాల నుంచి కీలక నేతలను తన పార్టీలోకి తీసుకొనేందుకు పావులు కదుపుతున్నారు. అందులో రాయలసీమ.. అందునా అనంతపురం జిల్లాలో కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడిగా పని చేసిన నేత టీడీపీలోకి ఎంట్రీకి రంగం సిద్దమైంది.

టీడీపీలోకి శైలజానాద్..!
రాయలసీమలో అనంతపురం టీడీపీకి తొలి నుంచి బలం ఉన్న జిల్లా. 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నివేదికలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఐ పాక్ క్షేత్ర స్థాయి సమాచారం సేకరించి పార్టీ అధినేతకు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన సాకే శైలజానాధ్ టీడీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. గతంలో శైలజానాద్ శింగనమల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ హయాంలో విప్ గా.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన తరువాత పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. కానీ, కొద్ది రోజుల క్రితం శైలజానాద్ ను పీసీసీ చీఫ్ గా తప్పించి గిడుగు రుద్రరాజుకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు ఏఐసీసీ అప్పగించింది. దీంతో, శైలజానాధ్ కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. త్వరలోనే పార్టీ మార్పుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

శింగనమల నుంచే పోటీ..
వచ్చే ఎన్నికల్లో తాను శింగనమల నుంచే పోటీ చేస్తానని శైలజానాధ్ ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాద్ టీడీపీ ముఖ్య నాయకత్వం తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. శైలజానాద్ 2004, 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ సీనియర్ నేత శమంతమణి పైన విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శమంతకమణికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో శంమతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పైన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పైన జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ నుంచి తిరిగి సీటు ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. శింగనమల నుంచి తనకు సీటు ఖరారు చేయాలని శైలజా నాధ్ కోరినట్లు సమాచారం.

అనంత జిల్లాలో టీడీపీ వర్సస్ వైసీపీ
అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన వైసీపీ..ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో వరుసగా అన్ని ,నియోజకర్గాల సమీక్షలు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో విభేదాలు బయట పడ్డాయి. ఇటు టీడీపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే, శింగనమల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి తిరిగి వైసీపీ నుంచి సీటు ఖాయమని తెలుస్తోంది. మాజీ మంత్రి శమంతకమణ తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరారు. ఇప్పుడు శైలజానాద్ కు సీటు పైన హామీ దక్కుతుందా లేదా అనేది చర్చకు కారణమవుతోంది. అయితే, చంద్రబాబు నుంచి హామీ తోనే శైలజానాధ్ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కకుంటే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications