కర్మభూమిపై అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రధాన ఘట్టాలను గుర్తుచేసుకుందాం.
1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలకుల నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. అంతకు ఒకరోజు ముందు పాక్ వేరుపడింది.1947-48 మధ్య కాలంలో కశ్మీర్ ప్రాంతం కోసం భారత్- పాక్ మధ్య తొలి యుద్ధం జరిగింది. స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూకశ్మీరు భారత్ లో విలీనం చేసేందుకు మహరాజా హరిసింగ్ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో వివాదం ముగిసింది.
1951లో రైల్వే లైన్లను జాతీయీకరించారు.అప్పట్లో మూడు జోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 1,19,630 కిలోమీటర్ల పొడవైన రైలుమార్గాలు, 7,216 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా అవతరించింది.1951లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 489 స్థానాలకు గానూ 364 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు.
1956 ఆగస్టు 4న ఆసియాలోనే తొలి న్యూక్లియర్ రియాక్టర్ ను భారత్ ప్రారంభించింది.

మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన మదర్ ఇండియా చిత్రానికి 1958లో ఆస్కార్ అవార్డు వరించింది. విదేశీ భాషా చిత్ర విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
విశాల భారతదేశం సాధించిన తొలి విజయం హరిత విప్లవం. 1960లో గోధుమలు, పప్పుధాన్యాల్లో కొత్త రకాల వంగడాల అభివృద్ధితో అధిక దిగుబడులను భారత్ సాధించగలిగింది. మిగులు ఆహార ధాన్యాలు సాధించడానికి ఈ విప్లవం దోహదపడింది.
భారత్ చైనా యుద్ధం: సరిహద్దు విషయమై భారత్- చైనా మధ్య తొలిసారి 1962లో యుద్ధం జరిగింది.
మెక్మెహన్ రేఖ, వాస్తవాధీన రేఖను చైనా అంగీకరించకపోవడంతో యుద్ధం తలెత్తింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది.












Click it and Unblock the Notifications