యాపిల్ ఫోన్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక
శాంసంగ్ (Samsung)స్మార్ట్‌ఫోన్ వినియోగించేవారికి కేంద్రం అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యాపిల్ ఉత్పత్తుల (Apple Products)కు కూడా కేంద్రం హై-రిస్క్ అలర్ట్ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) వెల్లడించింది.
దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్‌లో భద్రతా పరమైన లోపాలను కనుగొన్నారు.

యాపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయని, హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తించి చొరబడితే వారు సెక్యూరిటీ పరిమితులను బైపాస్ చేస్తారని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేస్తారని, తద్వారా సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తారని సెర్ట్-ఇన్ పేర్కొంది.
ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించారు. యాపిల్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది.
రెండు రోజుల క్రితం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉన్నట్లు సెర్ట్-ఇన్ తెలిపింది. ఫోన్ సెట్టింగ్స్‌లోని అబౌట్ డివైజ్‌లోకి వెళ్లి లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications