విజయవాడలో ఇండియన్ రైల్వే సంచలనం

భారతీయ రైల్వే సంచలనం సృష్టించింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా తనిఖీలు జరిపి భారీగా పెనాల్టీ వసూలు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అధికారులు టికెట్ చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. ఒకేసారి 86 మంది టికెట్ చెకింగ్ స్టాఫ్, 10 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఒక్కరోజులోనే 3,484 కేసులు నమోదు చేసిన రైల్వే సంచలనం సృష్టించింది.

ఈ డ్రైవ్‌లో రూ.24.5 లక్షల పెనాల్టీ వసూలు చేశారు. మొత్తం 3,484 కేసులు నమోదైతే అందులో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు 1641 కేసులు, ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించినందుకు 1825 కేసులు నమోదు చేశారు. టికెట్ లేనివారి నుంచి ఏకంగా రూ.15.41 లక్షలు, క్రమరహితంగా ప్రయాణించినవారి నుంచి రూ.9.10 లక్షలు అపరాధ రుసుముగా వసూలు చేశారు. రైల్వేద్వారా ధ్రువీకరింపబడని వెండర్స్ ను 9 మందిని గుర్తించి వారినుంచి రూ.45వేలు వసూలు చేశారు.

indian railway sensational decision

విజయవాడ డివిజన్‌లో మొత్తం 48 రైళ్లల్లో తనిఖీలు చేపట్టగా ఒక్కరోజులోనే రూ.24.5 లక్షల పెనాల్టీ వసూలు చేయడం విశేషం. ఒక్కరోజులోనే రైల్వే ఇంత సొమ్ములను ఫైన్ గా వసూలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా ప్రతి రైల్వేస్టేషన్ లో ఇలా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. వసూలయ్యే సొమ్ముల్లో అధిక భాగం టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారినుంచే వస్తున్నాయి. టికెట్ లేని ప్రయాణం నేరమని, జరిమానా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నప్పటికీ కొందరు ప్రయాణికులు పెడచెవిన పెడుతున్నారని, టికెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+