పరుగులు తీసిన 'వందే సాధారణ్'

భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టబోతున్న వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ముంబయి నుంచి బయలుదేరిన ఈ రైలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. రైల్వే ప్రయాణికులు పలువురు దాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏసీ బోగీలతో వందే భారత్ రైళ్లు నడుస్తున్నారు. వాటి తరహాలోనే వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ రైలును రూపొందించారు. ఇవి పూర్తిగా నాన్ ఏసీ బోగీలు.

మొత్తం 22 కోచ్ లు ఉంటాయి. స్లీపర్, జనరల్ క్లాస్ బోగీలే ఉంటాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. ప్రమాదాల గురించి అప్రమత్తం చేసేందుకు సెన్సార్లను అమర్చారు. వందే సాధారణ్ రైళ్లకు రెండు చివర్ల ఇంజన్లు ఉంటాయి. సిగ్నలింగ్, ట్రాక్ ను బట్టి వీటిని ఉపయోగిస్తారు. 1800 మంది ప్రయాణికులు ఈ రైళ్లల్లో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 500 కిలోమీటర్లకు పైగా ఉండే మార్గాల్లో ప్రయాణ సమయం ఆదా కానుంది.

indian railways vande sadharan train trial run success

ముంబయి-న్యూఢిల్లీ, పాట్నా, న్యూఢిల్లీ, హౌరా-న్యూఢిల్లీ, హైదరాబాద్ - న్యూఢిల్లీ, ఎర్నాకుళం-గౌహతి మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. దశలవారీగా సర్వీసులను పెంచుతారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల ఆదరణనుబట్టి ఇతర మార్గాలకుకూడా విస్తరిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+