విస్కీ ఎక్కువగా తాగుతున్నారు

మద్యం విషయంలో ద్రవ్యోల్బణం గురించి భారతీయులు పట్టించుకోలేదు. ఆల్కహాల్ ధరలు పెరిగినా అవి మద్యం ప్రియులను ప్రభావితం చేయలేకపోయాయి. ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ కొనుగోలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 400 మిలియన్ కేసుల మద్యాన్ని కొనుగోలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ తన రిపోర్టులో పేర్కొంది. 750 ml బాటిల్స్ 4.75 బిలియన్లు అమ్ముడుపోయాయి. రమ్ అయినా, బ్రాందీ అయినా, విస్కీ అయినా, జిన్, వోడ్కా.. ఇలా అన్నిరకాల మద్యం అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటితోపాటు ప్రీమియం బ్రాండ్స్ కూడా భారీసంఖ్యలో అమ్ముడు బోయాయి.

2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 39.5 కోట్ల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. సంవత్సరం క్రితం ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం ఎక్కువ. 2018-19లో 35 కోట్ల మద్యం కేసులు అమ్ముడుబోయాయి. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. 40 మిలియన్ కేసులను అదనంగా కొనుగోలు చేసి విక్రయాల రికార్డును 400 మిలియన్ కేసులుగా నెలకొల్పారు.

 whiskey-

గత సంవత్సరంలో అన్ని మద్యం కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచాయి. 2022-23 మధ్యకాలంలో భారతదేశంలో ధరలు పెరిగాయి. కాలం గాని కాలంలో ధరలు పెంచినా వినియోగదారుల నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదు. ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం, భారతదేశ ప్రజలు విస్కీని ఎక్కువగా తాగుతున్నారు. గత ఏడాది దీని విక్రయాలు 11.4 శాతం వృద్ధి చెందాయి, మొత్తం మద్యం విక్రయాల్లో రెండొంతుల అమ్మకాలు దీనివే. మొత్తం అమ్మకాల్లో 21 శాతం బ్రాందీ, 12 శాతం రమ్ ఉండగా, ఓడ్కా, జిన్ అమ్మకాలు భారీ వృద్ధిని సాధించాయి. వాటి అమ్మకాలు వరుసగా 29 శాతం, 61 శాతం చొప్పున పెరిగాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+