ఏపీకి మరో భారీ పరిశ్రమ.. రూ.20850 కోట్లతో పెట్టుబడులు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కీలక అడుగు పడింది. కడప జిల్లా సున్నపురాళ్ల పల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
భారీ పెట్టుబడులు, దశలవారీ ప్రణాళిక..
ఈ ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో రూ. 4,500 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభం కానున్నాయి. అనంతరం రెండో దశలో రూ. 16,350 కోట్ల పెట్టుబడితో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 20,850 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు.

ప్రాజెక్ట్ టైమ్‌లైన్..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జనవరి 2026 నాటికి మొదటి దశ పనులు ప్రారంభమవుతాయి. ఈ పనులను ఏప్రిల్ 2029 నాటికి పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. రెండో దశ పనులు జనవరి 2031 నాటికి ప్రారంభమై, ఏప్రిల్ 2034 నాటికి పూర్తవుతాయి.
భూమి కేటాయింపు..
స్టీల్ ప్లాంట్ కోసం మొత్తం 1100 ఎకరాల భూమిని ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున కేటాయించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూమి కేటాయింపుతో పాటు రోడ్లు, విద్యుత్, నీటి వనరులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించబడింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రకారం జేఎస్‌డబ్ల్యూ సంస్థకు పన్నుల రాయితీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, తక్కువ ధరలకు నీరు మరియు విద్యుత్ కేటాయింపులు అందించనున్నారు. రోడ్ల విస్తరణ, రైల్వే కనెక్టివిటీ, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
ఉపాధి అవకాశాలు..
ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి.. పరోక్షంగా 25,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఉద్యోగావకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడానికి విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు.. రెవెన్యూ, ఆర్థిక శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏపీఐఐసీ వీసీ & చైర్మన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. స్టీల్ ప్లాంట్ స్థాపనతో కడప జిల్లా పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీమలో ఆర్థిక వృద్ధి, ఇన్వెస్ట్మెంట్ ల ఆకర్షణ, ఉపాధి సృష్టి వంటి రంగాల్లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications