స్టెల్లా కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, బోరుమన్న పేరెంట్స్: ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి?
విజయవాడ: ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఒకరు సోమవారం హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన దొమన్మేటి భానుప్రీతి విజయవాడలోని స్టెల్లా కళాశాలలో చదువుతోంది.
ఆమె ఇంటర్మీడియేట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఆమె అనారోగ్యానికి గురి కావడంతో పదిహేను రోజుల క్రితం తండ్రి సుబ్బారావు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆసుపత్రిలో చూపించుకున్న తర్వాత తండ్రితో కలిసి ఆదివారం సాయంత్రం కళాశాలకు వచ్చింది.
సోమవారం కాలేజీలో పరీక్ష ఉన్నప్పటికీ వెళ్లకుండా గదిలోనే ఉంది. సాయంత్రం విద్యార్థులు గదికి వచ్చి తలుపు కొడితే తెరవలేదు. వారు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని, ఆమె గదిని పరిశీలించారు. సూసైడ్ నోట్ లభించలేదు.

కాగా, దీనిపై బంధువులు, పలువురు విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని తప్పు బడుతున్నారు. భానుప్రీతి మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాకుండానే భానుప్రీతిని ఉరితాడు నుంచి తీసి మంచంపై పడుకోబెట్టారని విమర్శిస్తున్నారు.
విద్యార్థులు ఆమె మృతిపై సమాచారం ఇవ్వడంతో వాచ్‌మన్ వచ్చి, డోర్ పగులగొట్టి.. భానుప్రీతిని ఉరితాడు నుంచి తీసి మంచం పైన పడుకోబెట్టాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, భానుప్రీతి ఆత్మహత్య గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు బోరును విలపించారు.
ఎస్ఎఫ్ఐ, ఎబివిపి విద్యార్థి సంఘాలు భానుప్రీతి గదిని పరిశీలించారు. అనంతరం వారు కళాశాల గేటు ఎదుట ధర్నాకు దిగారు.
ఆ నెంబర్లు ఎవరివి?
పోలీసులు పక్కనే ఉన్న డస్ట్ బిన్‌లో కాగితాలు తీసి పరిశీలించారని, ఈ కాగితాల్లో ఫిజిక్స్ రఫ్ పేపర్ పైన స్కెచ్ పెన్‌తో ముగ్గురి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఆ పేర్లతో పాటు పలు ఫోన్ నెంబర్లు ఉన్నాయని సమాచారం. ఈ నెంబర్లు ఎవరివనేది తెలియాల్సి ఉందంటున్నారు.
కావ్యంలాంటి నా జీవితం కరిగిపోయే కాలానికి, చెరిగిపోయే రాతలకు ఒకే ఒక తియ్యని జ్ఞాపకం అని తెలుగు పుస్తకం మొదటి పేజీలో రాసి ఉందని తెలుస్తోంది. కాగా, భానుప్రీతి ఎక్కువగా మాట్లాడదని స్నేహితులు చెబుతున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications