PSLV C55: కౌంట్ డౌన్ మోదలు.. పీఎస్‌ఎల్వీ ప్రయోగానికి సర్వం సిద్దం..!!

పీఎస్‌ఎల్‌వీ-సీ55 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. శ్రీహరి కోట నుంచి PSLV -C55 రాకెట్ మరి కొద్ది సేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. శుక్రవారం మధ్నాహ్నం 12 గంటల 50 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమై 25 గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది. ఈ ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 57వ ప్రయోగం. ఈ రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాధ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ప్రయోగాల్లో ఇది అయిదవదిగా చెబుతున్నారు. ఈ ప్రయోగం తర్వాత GSLV రాకెట్ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని అన్నారు.

ISRO will launch PSLV-C55 with two Singaporean satellites today

ఆతర్వాతనే చంద్రయాన్ 3 ,ఆదిత్య ప్రయోగాలు ఉంటాయని ఇస్రో ప్రకటించింది. లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కలిసి అభివృద్ధి చేశాయి. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది.

ఏడాదికి 12 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా.. ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమని చెప్పారు. వాణిజ్య రంగ ప్రయోగాల్లో ఇది ఐదోదని పేర్కొన్నారు. ఈ ప్రయోగానంతరం జీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని, ఆ తర్వాత కీలకమైన చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగాలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇకపై ప్రతినెలా ఒక ప్రయోగం ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+