జూన్2న రాష్ట్రపతిపాలన ఎత్తివేత, పిఎంవోలో మోడీ పాఠం
న్యూఢిల్లీ: జూన్ 2వ తేదీన తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయనున్నారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సంబంధించిన ఫైల్ పైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సంతకం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. జూన్ 2న తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 8న చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసే అవకాశముంది.
కాగా, రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిగణలోకి తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యమిచ్చి వాటిని సున్నితంగా డీల్ చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులకు సూచించారు.

రాష్ట్రాల సమస్యలకు ప్రధాన్యమిచ్చనప్పుడే దేశ సమాఖ్య నిర్మాణం బలోపేతమవుతుందని చెప్పారు. రాష్ట్రాల ప్రగతి పైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పిఎంవో అధికారులతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications