100మంది కెసిఆర్‌లు వచ్చినా: ఎర్రబెల్లి, వసూళ్ల పోటీ

Errabelli Dayakar Rao
హైదరాబాద్: వందమంది కెసిఆర్‌లు వచ్చినా తెలంగాణలో తమ పార్టీకి ఉనికి లేకుండా చేయలేరని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం మండిపడ్డారు. తెలంగాణాలో టిడిపి ఉనికి లేకుండా చేయడం తెరాస తరం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఏ చీకటి ఒప్పందాలు పెట్టుకున్నారో తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పాలని ఎర్రబెల్లి సవాలు విసిరారు. తమవి తెరాసలాగా ఊసరవెల్లి రాజకీయాలు కాదని ఆయన విమర్శించారు.

తెరాస ఒకసారి కాంగ్రెస్ పొత్తు అంటుంది, మరోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటుంది, మరోసారి సిపిఐతో పొత్తు అంటుంది, ఏమిటిది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రావడం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంలో జాప్యం జరగడమేనని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారన్నారు. తెలంగాణా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నదని ఆయన ఆరోపించారు.

లోక్ పాల్ బిల్లును ఆమోదించిన పార్లమెంటుకు తెలంగాణా బిల్లును ఆమోదించడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటును స్తంభింపజేయడానికి ఒక వైపు కొందరు యత్నాలు చేస్తుండగానే లోక్ పాల్ బిల్లు ఉభయ సభల ఆమోదం చూరగొన్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును వెంటనే ఆమోదించాలని, అవసరమైతే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అయినా సరే తెలంగాణా బిల్లును ఆమోదింపజేసుకోవాలని ఆయ.న డిమాండు చేశారు. రాష్ట్రపతిని రేపు కలిసి వెంటనే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కోరతామని ఎర్రబెల్లి చెప్పారు.

తెరాసలో వసూళ్ల పోటీ

కెసిఆర్‌ను ఎవరు బాగా తిడితే వారికి పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తానంటూ తమ పార్టీ అధినేత చంద్రబాబు పోటీ పెట్టారన్న వ్యాఖ్యలపై టిటిడిపి నేత నర్సిరెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి పోటీ పెట్టింది కెసిఆరే అన్నారు. హరీష్ రావు, కెటిఆర్, కవితలలో ఎవరు ఎక్కువ వసూళ్లు చేస్తే వారికే వారసత్వ బాధ్యతలు అప్పజెబుతానని పోటీ పెట్టారన్నారు. వీరు ముగ్గురు పోటీ పడీ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు.

కవిత తండ్రి కనుచూపు మేరలో ఉంటూ కనపడ్డకాడికి దోచుకుంటూ సినిమాలు, బతుకమ్మలు, సెటిల్‌మెంట్లు అన్నింటిలో ఆరితేరి నాయకత్వం కోసం పోటీ పడుతున్నదన్నారు. కెసిఆర్ జాతిపిత కాదు.. ఆయన మందు పీత, కవిత వసూళ్ల మాత, హరీశ్, కెటిఆర్ బ్లాక్‌మెయిల్ బ్రదరిల్లాలు అని విమర్శించారు. టిడిపిపై విమర్శలు మానకపోతే మీరు ఏ భాష వాడుతారో ఆ భాషలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ వస్తే దళితుడిని సిఎం చేస్తానన్న కెసిఆర్ దళితుల పైనే దాడి చేయించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+