అమ్మ మాట వింటూ, పగలబడి నవ్విన జగన్ (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు లోటస్ పాండులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షను చేపట్టారు.
పార్టీ కార్యకర్తల సమైక్యాంధ్ర నినాదాల మధ్య దీక్షకు కూర్చున్న జగన్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని, సోనియా వ్యవహరించిన తీరు బాగాలేదని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఆయన విమర్శించారు. చంద్రబాబు కేంద్రానికి విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుని దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆ దీక్షకు తాను కూడా మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలన్నారు. జగన్ దీక్ష ఇరవై నాలుగు గంటలు దాటింది.

వైయస్‌కు నివాళి
ఆమరణ దీక్ష ప్రారంభానికి ముందు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.

తండ్రి ఆశీర్వాదం కోసం
ఆమరణ దీక్ష ప్రారంభానికి ముందు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వైయస్ దీక్షలో
ఆమరణ దీక్ష ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలో చిత్తూరు నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు.

ఓ అమ్మ మాట వింటూ..
అమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ అమ్మ మాట వినేందుకు చెవులు రిక్కరించిన దృశ్యం.

జగన్ పగలబడి నవ్వాడు
అమరణ దీక్ష సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ సమయంలో పగలపడి నవ్వారు. ఆయన చేతిలో చిన్నారి.

ఎలా ఉన్నావు!
తన ఆమరణ దీక్ష ప్రాంగణానికి వచ్చిన చిన్నారులను పలకరిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జనం
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష నేపథ్యంలో హైదరాబాదులోని లోటస్ పాండుకు భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు.

జగన్ నవ్వు
ఆమరణ దీక్ష సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సరదాగా గడుపుతూ నవ్వుతున్న దృశ్యం.

జగన్ మాట్లాడుతూ
హైదరాబాదులోని లోటస్ పాండులో ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం.

జగన్
ఆమరణ దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మోములో చిరునవ్వు.












Click it and Unblock the Notifications