లోన్ యాప్స్ ఆగడాలపై జగన్ సీరియస్-చర్యలకు ఆదేశం-గతంలో మంత్రులకే తప్పని వేధింపులు

ఏపీలోని రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలయ్యారు. లోన్ తీసుకుని తిరిగి కట్టలేకపోవడంతో వేధింపులు మొదలయ్యాయి. ఇవి తట్టుకోలేక భార్యాభర్తలు చనిపోయారు. దీంతో వారి ఇద్దరు సంతానం అనాథలయ్యాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

రాజమండ్రిలో లోన్ యాప్స్ ఆగడాల ఘటనపై సీఎం జగన్ ఇవాళ స్పందించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అనాధలు కావడంపై జగన్ సమీక్షించారు. ఆ చిన్నారులకు ఇద్దరికీ ఐదేసి లక్షల చొప్పిన మొత్తం రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో లోన్ యాప్ ఆగడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. రిజర్వుబ్యాంక్ అనుమతి లేని యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు.

jagan regime finally respond on loan apps torture-order tough action against culprits

రాష్ట్రంలో ఇప్పటికే లోన్ యాప్స్ ఆగడాల కారణంలో ఎంతో మంది బలవుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో లోన్ యాప్స్ నిర్వాహకులు ఏకంగా మంత్రులు, మాజీ మంత్రులనే బెదిరించే స్ధాయికి వచ్చేశారు.

గతంలో మంత్రి కాకాణితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఇలాగే బెదిరించిన ఘటనపై పోలీసులు స్పందించి అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ కఠిన చర్యలకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+