విభజనకు కారకులైనవారిపై ప్రతీకారమే: కిరణ్ రెడ్డి పార్టీ
రాజమండ్రి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జై సమైక్యాంధ్ర పార్టీ తీర్మానాలు ఆమోదించింది. బుధవారం రాజమండ్రిలోని ఓ హోటల్‌లో సమావేశమైన పార్టీ కార్యవర్గ సభ్యులు పలు తీర్మానాలు చేశారు. విభజనకు కారకులైన వారిపై ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలని జై సమైక్యాంధ్ర పార్టీకి సహకరించాలని తీర్మానించారు.
ఉత్తర కోస్తాలో కిరణ్ పర్యటన ఉంటుందని త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేశామని, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. పార్టీ ప్రకటించేందుకు దారి తీసిన పరిస్థితులు, పార్టీ లక్ష్యాల గురించి రాజమండ్రి సభలో కిరణ్ వివరించారు.

అదే సమయంలో పార్టీ బలోపేతానికి అబిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత కిరణ్ అక్కడి నుంచి సభా స్థలికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు సాధారణ ఎన్నికలు, పరీక్షల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరనుంది.
కాగా, కార్యవర్గ సమావేశానంతరం జరిగిన బహిరంగ సభకు ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ బ్యానర్‌ను జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కమార్ రెడ్డితో పాటు హర్షకుమార్, సబ్బం హరి, రాష్ట్ర మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పాల్గ1న్నారు.












Click it and Unblock the Notifications