18 మందితో జనసేన అభ్యర్థుల జాబితా: పవన్ కళ్యాణ్ సహా నేతలకు టికెట్ ఖరారు
అమరావతి: పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా స్థానాలకు టికెట్లు ప్రకటించారు. అయితే, అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.
తాజాగా ప్రకటించిన జనసేన అసెంబ్లీ అభ్యర్థులు:
Recommended Video

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్
నెల్లిమర్ల నుంచి లోకం మాధవి
అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ
రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్
నిడదవోలు నుంచి కందుల దుర్గేష్
పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ
రాజోలు నుంచి దేవ వరప్రసాద్

తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు
నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు
పోలవరం నుంచి చిర్రి బలరాజు
తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు నుంచి డా. యనమల భాస్కరరావు పోటీలో ఉన్నారు.
ఇది ఇలావుండగా, ఆదివారం బీజేపీ 111 మందితో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
ఏపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే
అరకు నుంచి కొత్తపల్లి గీత
అనకాపల్లి నుంచి సీఎం రమేష్
రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి
నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ
తిరుపతి (ఎస్సీ): వరప్రసాదరావు
రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి.












Click it and Unblock the Notifications