వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నను గెలిపించనోడు..మమ్మల్ని గెలిపిస్తాడా!: పవన్‌పై చింతమనేని ఇంత వెకిలిగా..

'పవన్ అభిమానులున్నారని మేం పంచాయితీ ఎలక్షన్స్ గెలిచామా.. ఆడొచ్చి గెలిపించాడు.. ఈడొచ్చి గెలిపించాడు అంటే ఎలా? అన్నను గెలిపించనోడు.. మమ్మల్ని గెలిపిస్తాడా?'-చింతమనేని

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వివాదస్పద తీరుతో వార్తల్లోకి ఎక్కే టీడీపీ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదానికి కేరాఫ్ గా మారారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఓ టీవి ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చింతమనేని వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ చింతమనేని ఏమన్నారంటే!:

టీవీ చానెల్ ఇంటర్వ్యూ సందర్బంగా.. 2014 ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీకి, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు? కదా అన్న ప్రశ్నకు చింతమనేని నోరు పారేసుకున్నారు. ఆయన నిర్వహించకపోయినా గెలిచాం.. నిర్వహించినా గెలిచాం.. అంటూ వెకిలిగా సమాధానం చెప్పారు.

'పవన్ అభిమానులున్నారని మేం పంచాయితీ ఎలక్షన్స్ గెలిచామా.. ఆడొచ్చి గెలిపించాడు.. ఈడొచ్చి గెలిపించాడు అంటే ఎలా? అన్నను గెలిపించనోడు.. మమ్మల్ని గెలిపిస్తాడా?' అంటూ ఆవేశంగా బదులిచ్చారు చింతమనేని.

Janasena cadre fired on Chintamaneni Prabhakar controversial comments on Pawan kalyan

చింతమనేని తీరుకు నిరసనగా రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు:

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమగోదావరిలో జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. జిల్లాలోని జంగారెడ్డి గూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరుల్లో ధర్నా నిర్వహించారు. టీడీపీ గెలుపులో పవన్ పాత్ర లేదంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్బంగా అభిమానులు డిమాండ్ చేశారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగిన కార్యకర్తలు.. చింతమనేనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్‌ కల్యాణ్‌ చేసిన కృషిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. చింతమనేని తక్షణం క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు.

ఈ సందర్బంగా జనసేన కార్యకర్తలు చింతమనేని దిష్టి బొమ్మను దహనం చేసి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చింతమనేనికి సొంతంగా అంత దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు దిగాలని వారు సవాల్ చేశారు.

English summary
Janasena cadre and pawan kalyan fans are strongly opposing MLA Chintamaneni controversial comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X