గుర్తు పెట్టుకో జగన్.. నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తా: పవన్‌కల్యాణ్
గుర్తు పెట్టుకో జగన్.. నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తా.. అలా చేయకపోతే నాపేరు పవన్ కల్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు అంటూ గట్టిగా తొడకొట్టి సవాల్ చేస్తే ఆనాడు అందరికీ పవన్ కల్యాణ్ లో ఆవేశమే కనిపించింది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజయం సాధిస్తాడు అనే వాక్యాన్ని నిజం చేసి మరోసారి నిరూపించాడని అర్థమవుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో నిజమైన గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ ఒక్కడే. ఈ ఫలితాల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోయిందంటే ఆ క్రెడిట్ కచ్చితంగా పవన్ కల్యాణ్‌దే.
వేగంగా మారిన రాజకీయం
చంద్రబాబు అరెస్ట్ నుంచి ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. అప్పటివరకు పొత్తు ఉంటుందా? ఉండదా? అనుకుంటున్నవారికి ఆ క్షణంలోనే స్పష్టత ఇచ్చారు. పిఠాపురంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాదు.. పోటీచేసిన 21 స్థానాల్లోను 21 విజయాలు, లోక్ సభ నియోజకవర్గాల్లోను విజయాన్ని జనసేనకు అందించారు. వందకు వందశాతం ఫలితాన్ని పార్టీకి అందించి నాయకులు, కార్యకర్తల్లో జోష్ ను నింపారు.

నిస్పక్షపాత రాజకీయం
తెలుగుదేశం పార్టీ విజయంలో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా తన పాత్రను చాకచక్యంగా పోషించారు. బీజేపీని పొత్తులోకి లాక్కురావడం, అందుకోసం ఢిల్లీకి వెళ్లడం, ఆ పార్టీకోసం సీట్లను త్యాగం చేయడంలాంటి సంఘటలన్నీ పవన్ కల్యాణ్ లోని నిబద్ధతను, నిస్పక్షపాతానికి అద్దం పట్టాయి. కేవలం 21 సీట్లే తీసుకున్నాడంటూ ఎగతాళి చేసినవారికి ఎన్ని సీట్లలో పోటీచేశామన్నది కాదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేశామా? లేదా? అన్నది ముఖ్యమని చెప్పడమే కాకుండా ఆ 21 సీట్లలోను గెలిపించి వాళ్ల నోళ్లు మూయించాడు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయడంలో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలు పరిచిన విధానం బలంగా పనిచేసింది. అధికారపక్షం పవన్ దే, ప్రతిపక్షం పవన్ దే. పవర్ స్టార్ అనే తన బిరుదో ఉన్న పవర్ ను ఇప్పుడు కల్యాణ్ తన సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ అనే పేరుకు అక్షరాలా అర్హుడు పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications