బీజేపీ పంజరంలో రామచిలుక.. పవన్‌కల్యాణ్?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భారతీయ జనతాపార్టీ పంజరంలో రామచిలుకలా ఉన్నారా? ప్రస్తుతం ఆయన రాజకీయ కూడలిలో నిలబడ్డారా? పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలోని అయోమయంలో ఉన్నారా? పొత్తులపై జనసేనాని చేస్తున్న ప్రకటనలు ఆయన అవగాహనా లేమిని, తొందరపాటుతనాన్ని సూచిస్తున్నాయా? అనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది.

జనసేనకు స్థిరమైన ఓటుబ్యాంకు
రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి స్థిరమైన ఓటుబ్యాంకు లేదు. కానీ జనసేనకు ఉంది. కార్యకర్తల బలం ఉంది.. సామాజికవర్గం అండ ఉంది.. కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో ప్రబలమైన శక్తిగా రూపాంతరం చెందే అవకాశం కనపడుతోంది. కానీ పవన్ కల్యాణ్ అవగాహన లేమితో, తొందరపాటు ప్రకటనలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయాన్ని కల్పించడమే కాకుండా ప్రజలను కూడా అయోమయంలోకి నెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దించాలంటే ఎట్టి పరిస్థితుల్లోను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తాను.. అవసరమైతే పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ఆయన తపన, ఆయన ఆలోచనా విధానం బాగున్నప్పటికీ వేస్తున్న అడుగులు సవ్యదిశగా సాగడంలేదని, రాజకీయంగా సరైన పదనిర్ధేశం లేకపోవడమే దీనికి కారణమని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉభయతారకం!
పవన్‌కల్యాణ్‌కు రాజకీయ చరిష్మా ఉంది. ఎంతో మంది ఓటర్లను ఆకర్షించగలరు. కానీ ఆయన బీజేపీతో పొత్తు విషయం తేల్చలేకపోతుండటంపై జనసేన శ్రేణుల్లో కూడా ఓపిక నశిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు బీజేపీతో పొత్తును అంగీకరించడంలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఉభయతారకంగా ఉంటుందనేది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల భావనగా ఉంది. జనసేనాని సైతం వ్యక్తిగతంగా ఇదే అభిప్రాయంలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే తాను ఎంతో వ్యతిరేకించే వైసీపీ ప్రభుత్వంలోని కీలకమైన నేతలతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు చనువుగా మెలుగుతుండటాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి రెండుపార్టీల మధ్య మాటలు లేవు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎక్కడా జనసేన జెండా ఎగరలేదు. పవన్ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో దాదాపుగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. కానీ దీనిపై ఇరుపార్టీల నుంచి స్పష్టమైన ప్రకటన రావడంలేదు.

రోడ్ మ్యాప్ వచ్చింది కానీ..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పవన్‌కల్యాణ్ బీజేపీ నుంచి వచ్చే రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా వెళ్దామనే రోడ్‌మ్యాప్ వచ్చినట్లు ఆ పార్టీవర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే విషయంలో మాత్రం జనసేనాని స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలా? భారతీయ జనతాపార్టీతో కలిసి వెళ్లాలా? అనే మీమాంసతో ఊగిసలాడుతున్నారు. ఏదో ఒక నిర్ణయం మాత్రం త్వరగా తీసుకోవాలనే ఒత్తిడి జనసేన శ్రేణుల నుంచి మాత్రం వస్తోంది. మరి జనసేనాని ఏం చేస్తారో వేచిచూద్దాం.!!
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications