Janasena: ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ షాక్..! యూట్యూబ్ కు ఫిర్యాదు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేన పార్టీకి ఇవాళ షాక్ తగిలింది. పార్టీ తరఫున అధికారిక వీడియోలు, లైవ్ లు పోస్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ ను హ్యాకర్లు హ్యాక్ చేసారు. మైక్రోస్ట్రాటజీ పేరుతో దీన్ని హ్యాక్ చేశారు. దీంతో అర్ధాంతరంగా
వీడియోలన్నీ నిలిచిపోయాయి. అంతే కాదు కొత్త వీడియోలు కూడా దీనికి వచ్చి చేరాయి. అంతే కాదు ఛానల్ పేరు కూడా మారిపోయింది. దీంతో అభిమానులంతా షాకయ్యారు. వెంటనే యూట్యూబ్ కు ఫిర్యాదు చేశారు.

ఇవాళ హ్యాకర్లు జనసేన అధికారిక యూట్యూబ్ ఛానల్ ను హ్యాక్ చేసి దాని పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చేశారు. అంతే కాదు ఈ ఛానల్లో జనసేన వీడియోల స్ధానంలో బిట్ కాయిన్ వీడియోలు పెట్టారు. తద్వారా యూట్యూబ్ సదరు ఛానల్ ను పూర్తిగా బ్లాక్ చేసేలా ప్రయత్నించారు. విషయం తెలియడంతో జనసేన పార్టీకి చెందిన టెక్నికల్ సిబ్బంది యూట్యూబ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అసలే ఎన్నికల వేళ పార్టీ ప్రచారం అంతా ఇందులోనే షేర్ చేస్తున్నారు. దీంతో పార్టీకి ఇదో షాక్ గా మారింది.

రాష్ట్రంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంతో పాటు పలు ఎన్నికల వీడియోల్ని జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. వీటికి పవన్ కళ్యాణ్, జనసేన అభిమానుల నుంచి భారీగా స్పందన కూడా ఉంటుంది. అలాగే లక్షల సంఖ్యలో ఈ యూట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఛానల్ హ్యాక్ కావడంతో జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.













Click it and Unblock the Notifications