సోదరుడే హంతకుడు, మూడేళ్ళ తర్వాత కేసును ఇలా..
మనస్పర్థల కారణంగా ఆర్మీలో పనిచేస్తోన్న ప్రభాకర్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని హత్య చేశాడు. మూడేళ్ళ తర్వాత ఈ కేసును సిఐడి పోలీసులు నిందితుడు ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు.
నెల్లూరు:ఇద్దరు సోదరుల మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తిని అతని సోదరుడే పథకం ప్రకారం హత్య చేశాడు. నిందితుడిని మూడేళ్ళ తర్వాత సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆర్మీలో జవాన్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.
నెల్లూరు జిల్లాలోని వింజమూరు గెండెమడకల అటవీ ప్రాంతంలో 2014 ఏప్రిల్ నెలలో రేవనూరు ప్రసాద్ రెడ్డి హత్య కు గురయ్యాడు.
ప్రసాద్ రెడ్డి హత్యకు గురైన విషయాన్ని పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా ప్రయోజనం లేకపోయింది.ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
దీంతో పోలీసులు ఈ కేసు విచారణను సిఐడికి అప్పగించారు.విభిన్న కోణాల్లో దర్యాప్తుచేపట్టారు అధికారులు చివరకు సోదరుడే ప్రభాకర్ రెడ్డిని హత్య చేశారని తేల్చారు సిఐడి పోలీసులు.

ప్రసాద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు దాయాదుల పిల్లలు. వీరిద్దరి మద్య ఎంతో కాలంగా మనస్పర్థలున్నాయి. జవాన్ గా పనిచేస్తోన్న ప్రభాకర్ రెడ్డి సెలవులకు గ్రామానికి వస్తే ప్రసాద్ రెడ్డిని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేసేవాడు.కాని, అవి అమలయ్యేవి కావు.
దీంతో 2014 ఏప్రిల్ లో ప్రభాకర్ రెడ్డి సెలవుపై గ్రామానికి వచ్చాడు. ఏప్రిల్ 17న, ప్రసాద్ రెడ్డి కుమారుడి పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్ళాడు.
తనతో పాటు కత్తి, కారం తీసుకెళ్ళాడు.ప్రసాద్ రెడ్డిని పార్టీ ఉందంటూ అక్కడి నుండి ఎవ్వరికి చెప్పకుండా బైకుపై తీసుకెళ్ళాడు.
గెండెమడకల అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి కళ్ళల్లో కారం చల్లి కత్తితో దాదాపుగా 11 సార్లు విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశాడు.
ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి అక్కడి నుండి ఫంక్షన్ కు హజరయ్యాడు ప్రభాకర్ రెడ్డి.పోలీసులు హత్య కేసును విభిన్న కోణాల్లో విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
సంక్రాంతి సెలవులపై వచ్చిన ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకొన్నాడు.దీంతో ఆయన్ను అరెస్టు చేశారు.ఆదివారం నాడు ప్రభాకర్ రెడ్డిని కోర్టులో హజరుపర్చారు.












Click it and Unblock the Notifications