ఏపీకి ఇవన్నీ చేయండి: బీజేపీని ఏకిపారేసిన జేపీ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పైన లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఉందని విమర్శించారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అన్నారు.

అనంతపురం సప్తగిరి కూడలిలో తెలుగు భవిత - సంకల్ప దీక్ష పేరిట జేపీ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపనను నెరవేర్చాలన్నారు.












Click it and Unblock the Notifications