బాధగానే ఉంది: జెసి, జగన్ చెప్పినట్లే విభజన: బైరెడి

పార్టీలు మారిన ఆనం వంటివారు తన గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, పార్టీలు మారినవారికి తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ఉంటేనేం, పోతేనేం అనేవారితోనే సమస్య వచ్చిందని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికలు పూర్తయ్యే వరకు పిచ్చామె చేతిలోనే అధికారం ఉంటుందని, ఆమె రాయి ఎటు విసురుతుందో తెలియదని జెసి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. ఓ పార్టీ ఎంపి సీటుకు 30 కోట్ల రూపాయలు, ఎమ్మెల్యే సీటుకు ఐదు కోట్ల రూపాయలు అడుగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు మాత్రమే పనిచేయదని, అభ్యర్థి గుణగణాలు, సామర్థ్యం ముఖ్యమని జెసి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెప్పినట్లే విభజన జరిగిందని రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు కాంగ్రెసులా మారిందని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో చేరేవారికి, చేర్చుకునేవారికి సిగ్గు లేదని అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కర్నూలుకు సీమాంధ్ర రాజధానిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో ఎన్ఐడిని ఇవ్వడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications