ఛీఛీ అంటే ఏంచేస్తాం: డిగ్గీకి జెసి కౌంటర్, బొత్సకి సవాల్

ఛీఛీ.. పోపో అంటే తానేం చేస్తానని జెసి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసు అందలేదని, అలాంటప్పుడు తాను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఢిల్లీ నుండి వచ్చిన నోటీసు మధ్యలో ఎక్కడ ఉండిపోయిందో తనకు తెలియదన్నారు.
తాము నాలుగు తరాలుగా కాంగ్రెసు పార్టీలోనే ఉన్నామని, అలాంటి తమను అధిష్టానం వద్దనుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే తానే సీనియర్‌ను అన్నారు. షోకాజ్ నోటీసు విషయమై ముఖ్యమంత్రి తనతో ఏమీ మాట్లాడలేదని చెప్పారు. నాలుగు తరాల అనుబంధాన్ని వీడిపోవడం బాధాకరమే అన్నారు. తనను పార్టీలో ఉండవద్దని బొత్స అంటున్నారని, అతనితో మాట్లాడేందుకు తాను ప్రయత్నిస్తున్నా, అందుబాటులోకి రావడం లేదన్నారు.
బొత్స గెలుస్తాడో లేదో అనుమానంగా ఉందన్నారు. తాడిపత్రిలో కాంగ్రెసు తరఫున ఎవరూ లేకుంటే బొత్సను వచ్చి పోటీ చేసి గెలవమనండని సవాల్ చేశారు. జనవరి 23వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి ఏం చెబుతారో తనకు తెలియదన్నారు. తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గం ఇంఛార్జీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.












Click it and Unblock the Notifications