టిడిపిలోకి జెసి: లోకసభకు పోటీ! టిలోను సైకిలెక్కారు

తాడిపత్రి ఎమ్మెల్యే అయిన జెసి ఈసారి అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశముంది.ఇక, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే అందులోకి వెళతానని ప్రకటించినా... విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు ప్రస్తుతం టిడిపిలో చేరనున్నట్లు తెలిసింది.
పార్టీలో చేరిక విషయమై చంద్రబాబుకు, శత్రుచర్లకు మధ్య గురువారం సాయంత్రం చర్చలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శత్రుచర్ల వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలోను టిడిపిలోకి ఇతర నేతలు వస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు టిడిపిలో చేరారు. సోయం 2004లో బోథ్ నుంచి తెరాస టికెట్టుపై గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కానీ, బోథ్ టిడిపి ఎమ్మెల్యే నగేష్ ఇటీవల తెరాసలో చేరడంతో సోయం సైకిలెక్కారు. మెదక్ జిల్లా జగన్ పార్టీ నేత భట్టి జగపతి టిడిపిలోకి తిరిగి వచ్చారు. ఆయనకు మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications