జోగి రమేష్ పై మరో కేసు - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!
మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్‌వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. కాగా, జోగి రమేష్ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేసారు. ఈ కేసులోనూ టీడీపీ కార్యకర్తల పైన కేసు నమోదైంది. కాగా, దాడి సమయంలో తిరుపతిలో ఉన్న జోగి రమేష్ రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఇప్పుడు జోగి రమేష్ విషయంలో జరిగే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
మాజీ మంత్రి జోగి రమేష్ పైన మరో కేసు రిజిస్టర్ అయింది. మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేశ్‌పై Cr.No.64/2026 U/s 196, 353 r/w 3(5) BNS (153A, 505 r/w 34 IPC) పలు సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో Cr.No.66/2026 U/s 189(2), 190, 292, 324(4) BNS (143, 149, 290, 427 IPC) సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక జోగి నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తుండగా జరిగిన అరెస్టులపై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మస్తాన్, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు.

పార్టీ నేతలతో మంతనాలు
కాగా, జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సుమోటోగా తీసుకుని ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. అలాగే తెలుగుదేశం, వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావుల పేర్లు కూడా నమోదయ్యాయి. కాగా, తిరుపతి నుంచి తిరిగి నివాసానికి చేరుకున్న జోగి రమేష్ ను వైసీపీ నేత మొండితోక జగన్మోహన రావు కలిసారు. ఆ తరువాత జగన్మోహన రావుతో అర్ద్రరాత్రి 1.30 గంటలకు సమావేశం అయ్యారు. అయితే, జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. జోగి రమేష్ ప్రస్తుతం తన నివాసంలోనే పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేసారు. అటు జోగి రమేష్ ఇంటి పైన దాడి జరగటంతో మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. దాడుల పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications