రామకోటి రాసుకో: జగన్‌కు జెపి, పవన్ కళ్యాణ్‌పైనా

కాకినాడ/ శ్రీకాకుళం: సంతకాలతో తలరాతలు మారితే రామకోటి రాసుకో అని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత అధినేత వైయస్ జగన్‌కు హితవు పలికారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ ఎన్నికల ప్రచారంలో 5 సంతకాలతో ప్రజల తలరాతలు మారుస్తానన్న మాటలపై జెపి ఆ విధంగా స్పందించారు.

లోక్‌సత్తా పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారంనాడు ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు. ఓటర్లను మభ్యపెడుతూ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ మరోసారి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Jayaprakash Narayana

కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని తెరాస అధినేత కెసిఆర్, వైయస్ జగన్ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వీరితోపాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైతం కుటుంబపాలనను తీసుకొచ్చేందుకు తాపత్రయపడుతున్నారని విమర్శించారు.

పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మంచి మనిషి అని, త్యాగ గుణమున్న వ్యక్తి అని అటువంటి భావాలున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలు అవినీతిపై పోరాటం చేస్తున్న బిజెపికే తమ మద్దతు ఉంటుందని జేపీ ప్రకటించారు. దేశంలో వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+