వైద్య రంగంలో PPP తోనే మేలు: వైద్యారోగ్య మంత్రికి నడ్డా లేఖ
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక విషయాలను ప్రస్తావించారు. PPP విధానం వల్ల కలిగే ప్రయోజనాలను లేఖలో పేర్కొన్నారు. వైద్యరంగంలో PPP విధానంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించవచ్చని నడ్డా స్పష్టం చేశారు.
పైలట్ ప్రాజెక్ట్ వ్యయంలో 80 శాతం, 5 ఏళ్లపాటు నిర్వహణ వ్యయంలో 50 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందుతుంది.. మొత్తంగా 40శాతం వరకు కేంద్రం నుంచి రాయితీ ఉంటుంది. మౌలిక వసతులు భారీగా సమకూరుతాయి. సేవల నాణ్యత, పారదర్శకత, పెరుగతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ కు రాసిన లేఖలో నడ్డా స్పష్టం చేశారు. ఈ మేరకు PPP సెల్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
వైద్య రంగంలో PPP విధానంతోనే మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు రాసిన లేఖలో PPP విధానం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించవచ్చని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ వ్యయంలో 80 శాతం, 5 ఏళ్లపాటు నిర్వహణ వ్యయంలో 50 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందుతుందని అన్నారు. మొత్తంగా ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం వరకు కేంద్రం నుండి రాయితీ లభించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని నడ్డా లేఖలో పేర్కొన్నారు.

PPP విధానం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని నడ్డా వివరించారు. ప్రభుత్వ రంగంలోని వనరులు అలాగే ప్రైవేటు రంగంలోని నైపుణ్యాన్ని కలపడం ద్వారా సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. డయాగ్నోస్టిక్స్, డయాలసిస్ సేవలు, క్రిటికల్ కేర్ విభాగాలలో ఈ PPP నమూనా అత్యంత ప్రభావితంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో PPP సెల్ ఏర్పాటు చేయాలని లేఖలో ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications