వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా!: టాప్ హీరోల 'రాజకీయం'?

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అంశంతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారని ఇటీవల జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ జై లవకుశ సినిమాలో నటిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అంశంతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారని ఇటీవల జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ జై లవకుశ సినిమాలో నటిస్తున్నారు.

ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రాజకీయ అంశానికి సంబంధించినది అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాలో రాజకీయాల ప్రస్తావన ఉన్నప్పటికీ అదంతా కథకు లోబడి ఉంటుందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు ఈ సినిమాకు సంబంధం ఉండకపోవచ్చునని అంటున్నారు.

ఇటీవలి కాలంలో టాప్ హీరోల అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోన్న విషయం తెలిసిందే. సినిమా మాధ్యమంతో ఇమేజ్ పరంగానో లేక నిధులు సమకూర్చుకోవడమో చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి జూనియర్ సినిమాకు సంబంధం లేకపోయినప్పటికీ.. చర్చనీయాంశంగా మారింది.

అవసరాల కోసం..

అవసరాల కోసం..

2019 ఎన్నికల నాటికి చిరంజీవి ఎక్కువ సినిమాలు తీయాలని, ఆ ఇమేజ్‌తో ఎంతోకొంత లాభపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు నిధుల కోసం వరుసగా సినిమాలు తీస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అందుకే ఆసక్తికరం

అందుకే ఆసక్తికరం

2009లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసి, ఆ తర్వాత దూరమైన జూ ఎన్టీఆర్ సినిమా రాజకీయలతో ముడివడి ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఆయన తన సినిమాలో ఏ పార్టీకో వ్యతిరేకంగానో లేదా సమర్థించే విధంగానో నటించే అవకాశం లేదు. కానీ టిడిపికి మద్దతిచ్చి, ఆ తర్వాత దూరం కావడంతో.. జూ ఎన్టీఆర్ పొలిటికల్ కథతో ముందుకు వస్తున్నారనేది ఆసక్తికరంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో విడుదలయితే అది కచ్చితంగా మరింత చర్చకు దారి తీస్తుంది.

రంగంలోకి పవన్ కళ్యాణ్

రంగంలోకి పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి.. రానున్న ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. 2019లో ఆయన అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంద త్వరగా సినిమాలు పూర్తి చేసి, పార్టీ కోసం సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చిరంజీవిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్

చిరంజీవిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్

ఎనిమిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి ఇప్పుడు సినిమాలపై దృష్టి సారించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున.. 2019లోపు ఆయనతో మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమా తీయడం ద్వారా క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.

లెజెండ్

లెజెండ్

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా విడుదలయింది. ఎన్నికలకు ముందు ఈ సినిమా అప్పుడు చర్చకు దారి తీసింది.

రజనీకాంత్, సుమన్‌లు...

రజనీకాంత్, సుమన్‌లు...

ఇటీవలి కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఇక మరో ప్రముఖ నటుడు సుమన్ తెరాసలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

English summary
Jr NTR's next film with political back ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X