అవును! జగన్‌కి షాకిస్తున్నారు: 'మేమిద్దరం టిడిపిలో చేరుతున్నాం'
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇవ్వడం ఖాయమైంది. ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతున్నారు.
త్వరలోనే తాను టిడిపిలో చేరుబోతున్నట్లు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం నాడు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను అధికార పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు.

మంచిరోజు చూసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కుతానని చెప్పారు. తనతో పాటు మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని స్పష్టం చేశారు. కాగా, వరుపులు సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరుతారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కాగా, రెండు రోజుల క్రితం జ్యోతుల నెహ్రూ వైసిపిలో అన్ని పదవులకు రాజీనామా చేసిన విషయం జగన్ ఆలోచనలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నానని ఆయన తన రాజీనామా లేఖలో ఎద్దేవా చేశారు. జగన్‌కు పంపిన లేఖలో.. మీ మనసుకు నచ్చినట్లు నడుచుకోలేకపోతున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications